ETV Bharat / state

STUDENTS PROTEST : ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల ఆందోళన..

author img

By

Published : Nov 8, 2021, 4:22 PM IST

కృష్ణా జిల్లా నందిగామ(nandigama)లో కాకాని వెంకటరత్నం ఎయిడెడ్ కళాశాలను(KVR.aided college) ప్రైవేటు కాలేజీగా మార్చడంపై విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. తరగతులను బహిష్కరించి, కళాశాల ఎదుట ధర్నా(protest) చేపట్టారు. వీరి ఆందోళనకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు.

విద్యార్థుల ఆందోళన
విద్యార్థుల ఆందోళన

కృష్ణాజిల్లా నందిగామలో కాకాని వెంకటరత్నం ఎయిడెడ్ కళాశాల(KVR.aided college) ను ప్రైవేట్ కళాశాలగా మార్చడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. తరగతులు బహిష్కరించి, కళాశాల ఎదుట ధర్నా(protest) చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రోడ్డు పక్కన బైఠాయించి నినాదాలు చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాలను ప్రైవేటుపరం చేయడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

దశలవారీగా ఆందోళన ఉద్ధృతం...

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ కళాశాల, పాఠశాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకపోతే ప్రైవేటుపరం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా నందిగామ కేవీఆర్.కళాశాల యాజమాన్యం ప్రభుత్వంలోకి కళాశాలను విలీనం చేసేందుకు ఒప్పుకోలేదు. అప్పటినుంచి ఈ కళాశాలను ప్రైవేటుగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అప్పటివరకు దశలవారీగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నేతల మద్దతు...

విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. తెదేపా, సీపీఎం నాయకులు నిరసనలో పాల్గొన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రైవేటీకరణతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులకోసం, లక్షలమంది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసేందుకూ... ముఖ్యమంత్రి వెనుకాడటంలేదని తంగిరాల సౌమ్య విమర్శించారు.

ఎయిడెడ్​పై ప్రభుత్వ నిర్ణయం...

ప్రస్తుతం ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సౌకర్యాలను కల్పించాలని సంఘాలు కోరగా ఆమోదించారు. జిల్లా యూనిట్‌గా విలీనం చేస్తామని, ఏ పోస్టులో ఉంటే అదే పోస్టులు ఇస్తామని పేర్కొన్నారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయ సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలతో గురువారం నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ అధికారులు ఈ మేరకు హామీ ఇచ్చారు. ఎయిడెడ్‌లో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 6,800 మంది ఉన్నారు. ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న వారు సుమారు 1,347 మంది వరకు ఉన్నారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.