ప్రజలతో నిరంతరం పనిచేసిన అనుభవం ఉన్నవారిని ఈ రాజకీయ వ్యవస్థ ఎందుకో రాజకీయాల్లోకి రానివ్వడం లేదని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్యం ఉండేవారికి పిలిచి పదవులు ఇచ్చేలా రాజకీయ ప్రక్షాళన జరగాలని ఆకాంక్షించారు. ఈ విషయమై నేతలంతా ఆలోచన చేయాలని విజయవాడలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. ప్రజల మధ్య తిరుగుతూ- వారితో మమేకమై ఉండేవారికి కాకుండా ఇతరులకు పదవులు ఇస్తే ఏం మేలు కలుగుతుందన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లే శ్రీరామమూర్తి రాసిన 'నాజీవితం- గ్రామాభ్యుదయం' పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. రాజకీయ పదవి ఆశించినా.. శ్రీరామమూర్తికి రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వాసిరెడ్డి పద్మతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అలాంటి వారికి పిలిచి పదవులిచ్చేలా రాజకీయ ప్రక్షాళన జరగాలి: వాసిరెడ్డి పద్మ - State Women's Commission Chairperson Vasireddy Padma
నిరంతరం ప్రజల మధ్య ఉండేవారికి పిలిచి పదవులు ఇచ్చేలా రాజకీయ ప్రక్షాళన జరగాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆకాంక్షించారు. విజయవాడలో జరిగిన 'నాజీవితం- గ్రామాభ్యుదయం' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.