రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ వ్యవహారాల సలహాదారుగా నియమితులైన జ్ఞానేందర్‌రెడ్డికి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మీయ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్.. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చేసుకుని పాలన సాగిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల పేర్కొన్నారు. మూడేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రాభివృద్ధి గురించి అంతర్జాతీయ సమాజంలో ఉంటున్న ఎన్ఆర్ఐలకు వివరించాలని సలహాదారు జ్ఞానేందరరెడ్డికి సూచించారు.
రాష్ట్రంలో రెడ్డి వర్గంలో విభేదాలు సృష్టమవుతున్నాయని.. అంతర్గత విభేదాలతో చంద్రబాబుకు అధికారం ఇవ్వొద్దని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. సహజ మరణాలను మద్యం మరణాలుగా పేర్కొంటూ.. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని నారాయణస్వామి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్.. ప్రత్యేకంగా ఓ పార్టీ పెట్టి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా మంత్రులు, నేతలు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సారా మరణాలపై చర్చకు పట్టుబడితే సస్పెండ్ చేయడం సిగ్గుచేటు: తెదేపా