గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ఎడ్లపాడు మండల విద్యాశాఖాధికారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని..., ఇది సరికాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మండల విద్యాశాఖ అధికారుల సంఘం ఖండించింది. ప్రధానోపాధ్యాయుల నిరాధార ఆరోపణలు, రాజకీయపరమైన ఆరోపణలను ఆధారం చేసుకుని ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా నాడు నేడు పనులను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ పనులు వేగం కావటం లేదనే ఒత్తిడి వల్ల ఒకరిద్దరు ప్రధానోపాధ్యాయులు పై ఎంఈఓలు ఒత్తిడి చేసిన వెంటనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి రామాయణాన్ని వక్రీకరించారు... ఎడిటర్‌ను తొలగించండి'