అసత్య ప్రకటనలతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను మోసం చేస్తున్నారని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ బాబురావు ఆరోపించారు. పదిహేను శాతానికి మించి ఆస్తి, చెత్త పన్ను పెరగదని చెప్తున్న మంత్రి.. ఆ అంశాన్ని నోటిఫికేషన్లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఎదురు దాడి చేస్తారా అని నిలదీశారు. ఈ నెల 16, 17 తేదీలలో పన్ను పెంపు నోటిఫికేషన్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. వివిధ ప్రసార సాధనాల ద్వారా ప్రభుత్వం చేసే మోసాలను ప్రజలకు వివరిస్తామని బాబురావు స్పష్టం చేశారు.
ఇదీచదవండి.