దళిత, బహుజన వర్గాల హక్కుల ఉల్లంఘనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు దళిత, బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు తెలిపారు. ఈ నెల 5న విజయవాడలోని హోటల్ ఐలాపురంలో కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సంఘం జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నూతన ఇసుక విధానంపై తెదేపా నిరసన ర్యాలీ