ETV Bharat / state

వేసవి శిబిరాలు.. చిన్నారులకు కళా శిక్షణ కేంద్రాలు!

మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఉత్తేజాన్నిస్తోన్న కళల శిబిరం అది. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులకు... శాస్త్రీయ కళలను దగ్గరచేస్తోంది. అక్షరాల కూర్పుతో ఓనమాల నాట్యాభ్యాసం చేయిస్తోంది. నాట్యం, సంగీతం, చిత్రలేఖనంతో చిన్నారుల్లో దాగి ఉన్న కళలను వెలుగులోకి తీసుకొస్తోంది ఆ వేసవి శిబిరం.

కళల శిబిరం
author img

By

Published : May 17, 2019, 9:03 AM IST

కళల శిబిరం

నిత్యం శాస్త్రీయ కళల సాధనతో కళకళలాడే విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాల... వేసవిలో మరింత సందడిగా మారింది. నేటి తరం వారికి అద్భుత సంగీతాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో భాషా సాంస్కృతిక శాఖ కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఘంటసాల కళాశాలలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ చిన్నారులకు శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేస్తున్నారు. సంగీతం, నృత్యంతో పాటు కథలు, పద్యాలు, వ్యాసాలు, ఇలా 11 రకాల అంశాలపై చిన్నారులకు వేసవి శిక్షణ అందిస్తున్నారు.

ఓనమాల నృత్యం ప్రత్యేకం
కార్పొరేట్ విద్యావ్యవస్థ కారణంగా అమ్మ భాషకు నేటి తరం చిన్నారులు దూరమైపోతున్నారు. అ, ఆ లు కూడా చెప్పలేని దుస్థితి నెలకొంది. అందుకే ఈ వేసవి శిబిరంలో నాట్యం చేర్చుకునేందుకు వచ్చే వారిలో 9 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న వారికి అక్షరాలతో నాట్యాభ్యాసం చేయిస్తున్నారు. అ నుంచి ఱ వరకు వల్లెవేయిస్తూ లయబద్ధంగా నాట్యం చేయిస్తున్నారు.

ప్రాథమికాంశాల బోధన
ఒక్క నెలలో చిన్నారులకు మొత్తం సంగీతం నేర్పించడం సాధ్యం కాదు. అందుకే స్వరాలంటే ఏంటి, సంగీతమంటే ఏంటనే ప్రాథమిక అంశాలు వివరిస్తూ... అన్నమాచార్య కీర్తనలు, దేశభక్తి గీతాలను తాళయుక్తంగా నేర్పిస్తున్నారు. సంగీతం, నృత్యంతో పాటు కథలు, పద్యాలు, వ్యాసాలు, ఇలా 11 రకాల అంశాలపై చిన్నారులకు వేసవి శిబిరంలో శిక్షణ అందిస్తున్నారు. వీటిల్లో చాలా వరకు ఈనెల 10వ తేదీతో ముగిసిపోగా... సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తరగతులను ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

Intro:విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణం పట్టా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆరోగ్య సిబ్బంది dengue నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు

Body:ఈ రాలిని వైద్యాధికారి ఎం ఫణీంద్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి సాధారణమైన అన్నారు అయితే వ్యాధి నిరోధక శక్తి ఇ తక్కువగా ఉండడం ఇతర అనారోగ్య కారణాల వల్ల పిల్లలు వృద్ధులు మాత్రమే ప్రమాదకరంగా మారుతుంది అన్నారు

Conclusion:అతి తీవ్రమైన జ్వరం ఒంటిపై దద్దుర్లు కళ్ళు మంటలు తీవ్ర నీరసం వంటి లక్షణాలు ఉంటాయన్నారు ఈ జ్వరం వచ్చిన వారు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తే సులువుగా చికిత్స పొందుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.