ETV Bharat / state

చుక్​ చుక్ రైలు వస్తోంది.. ఇష్టమైన భోజనం తెస్తోంది.. ఆగినాక తినండి!

రైల్లో మనకు భోజనం దొరకడం కామన్. కానీ.. రైలే మన దగ్గరికి భోజనం మోసుకురావడం..? ఖచ్చితంగా వెరైటీనే. ఈ డిఫరెంట్ ఐడియాతోనే మొదలైందో రెస్టారెంట్. ఇందులో అద్భుతమైన రుచులు అందించడం ఒకెత్తయితే.. ఆ భోజనాన్ని బుల్లి రైలు మోసుకురావడం మరో విశేషం. కస్టమర్లు కూర్చునే ప్రతి జంక్షన్ వద్దకూ.. ఓ రైలు పరుగులు తీస్తూ ఉంది. ఈ వింత మీల్స్ స్టేషన్ కు వచ్చిన కస్టమర్లు.. సరికొత్త అనుభూతికి లోనవుతున్నారు. మరి, ఈ 'ట్రైన్‌ రెస్టారెంట్‌' సంగతులేంటో చూసేద్దాం పదండి.

special-train-restaurant-in-vijayawada
బెజవాడలోని 'ట్రైన్‌ రెస్టారెంట్‌'
author img

By

Published : Dec 6, 2021, 2:39 PM IST

దయచేసి వినండి... మరికొద్ది నిమిషాల్లో బిర్యానీ ఎక్స్‌ప్రెస్‌ రెండో నెంబరు టేబుల్‌ వద్దకు రానుంది. మీరు ఆర్డరిచ్చిన నోరూరించే ఐస్‌క్రీం... నాలుగో నంబరు టేబుల్‌పై సిద్ధంగా ఉంది. ఈ మాటలు వింటుంటే కొత్తగా ఉంది కదూ! విజయవాడలో ఆహారప్రియులకు సరికొత్త అనుభూతుల్ని పంచేందుకు ఏర్పాటైన.. ట్రైన్ రెస్టారెంట్‌ గురించే ఇదంతా. నగరంలోని ఎంజీ రోడ్డులో ఈ సరికొత్త 'ప్లాట్‌ఫాం-65 రెస్టారెంట్' అందుబాటులోకి వచ్చింది.

బెజవాడలోని 'ట్రైన్‌ రెస్టారెంట్‌'

భోజనంతో రైలు వచ్చేస్తుంది..!
ఆర్టర్‌ ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే కిచెన్‌ నుంచి నేరుగా వినియోగదారుల టేబుల్‌ చెంతకు కూత వేసుకుంటూ రైలు వచ్చేస్తుంది. మనం బుక్‌ చేసుకున్న ఆర్డర్‌ను ట్యాబ్‌ ఆధారంగా టేబుల్‌ నెంబర్‌తో సహా వంటకాల లిస్టును ఆన్‌లైన్‌లో కిచెన్‌లోకి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా వంటకాలు రైలులో టేబుల్‌ వద్దకు వస్తాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న బేరర్‌... వాటిని తీసుకుని భోజన ప్రియులకు వడ్డిస్తారు.

  • చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సర్విస్ కూడా చాలా బాగుంది. మేం వీడియో తీసుకుందాం అనుకున్నాం. కానీ అది చాలా స్పీడ్​గా వచ్చింది. బట్ మళ్లీ అడిగితే వెనక్కి పంపించి మళ్లీ పంపించారు. బాగుంది సర్వీస్.
  • కొత్త థీమ్. ఎక్కడా చూడలేదు. చాలా బాగుందండి.
  • బెడవాడ అని ఇన్​స్టా పేజ్ ఉంటుంది. అందులో చూాశాం. సో.. మా ఫ్రెండ్ బర్త్ డే ఉంది ఎలాగో ట్రై చేద్దామని వచ్చాము. బాగుంది. నచ్చింది.
  • ఆన్​లైన్​లో బుక్ చేస్కోవాలి మనం. రైల్వే స్టేషన్​లో టికెట్ బుక్ చేస్కున్నట్లు మనం వీళ్ల దగ్గర కూడా టికెట్ బుక్ చేస్కోవాలి. కానీ.. మేం అనుకోకుండా బిలేటెడ్ బర్త్​డే పార్టీని ఇక్కడికి వచ్చి చూస్కున్నాం. ప్లాట్​ఫాం చాలా బాగుంది.

రైల్వేస్టేషన్‌కు వెళ్లి తిన్నట్లే ఉంటుంది..
తాము కోరిన ఆహారంతో కళ్ల ముందుకు వచ్చే రైళ్లు, అలాగే తింటున్నంతసేపు పక్క నుంచి ఫుడ్‌ తీసుకువెళ్ళే రైళ్ళను చూస్తూ భోజన ప్రియులు సరికొత్త లోకంలో విహరిస్తున్నారు. భోజనాలు తెచ్చే రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందిస్తున్నారు. ప్లాట్‌ఫాం-65 రెస్టారెంట్‌కు ఆహార ప్రియుల తాకిడి అధికంగా ఉంది. ఘుమఘుమలాడే వంటకాలతో ఆహార ప్రియుల మనసు దోచేస్తోంది. ఈ రెస్టారెంట్‌లో తింటుంటే... రైల్వేస్టేషన్‌కు వెళ్లి భోంచేసినట్లు ఉందని చెబుతున్నారు.

  • ట్రైన్ చూసి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ ఐటమ్స్ కూడా బాగున్నయ్. చాలా బాగుంది. చాలా ఎక్స్​లెంట్​గా ఉంది.
  • సేమ్ ఆసిటీస్ ట్రైన్​లో కూర్చొని తింటున్న ఫీల్ వచ్చింది. బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. కేవలం పిల్లల కోసమే వచ్చాం మేమిక్కడికి.

అణువణువూ రైలుతో అనుబంధం..

కొత్తదనాన్ని ఆస్వాదించేందుకు విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని.. ఈ క్రమంలోనే ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రెస్టారెంట్‌లోకి ప్రవేశించినప్పటి నుంచీ అణువణువూ రైలుతో అనుబంధాన్ని పెంచేలా తీర్చిదిద్దారు. ప్రవేశ ద్వారం వద్ద రైలింజన్, రైలు చిహ్నాలు ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌ను విజయవాడ, గుంటూరు, బొబ్బిలి, గుడివాడ, నిడదవోలు సహా వివిధ జంక్షన్‌ల తరహాలో ఏర్పాటుచేశారు.

ఇదీ చూడండి: ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్​ న్యూట్రిషన్​ పార్క్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.