ETV Bharat / state

ఒక్కసారి తాగితే మళ్లీ అడుగుతారు - etv bharat

టర్కీ కాఫీ.. ఇది మీరు ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ తాగాలనుకుంటారు. అందులో ఏముంది ప్రత్యేకత అదే కాఫీ పౌడర్, అవే పాలు కదా.. అంటారా.. కాదులెండి.. పాలలో సౌదీ నుంచి తీసుకొచ్చిన కాఫీ పొడి, పంచదార కలిపి.. దాన్ని రెండు రాగి పాత్రల్లో వేసి ఇసుకపై కాస్తారు. ఇసుకపై మరగించడం ఏంటి అనుకుంటున్నారా... అదేంటో మీరు తెలుసుకోండి.

రాగీ పాత్రల్లో కాఫీ రెడీ
author img

By

Published : Aug 13, 2019, 10:20 AM IST

రాగి పాత్రల్లో కాఫీ తయారుచేస్తున్న దృశ్యం

"అనుదినంబు కాఫీయే అసలు కిక్కు. కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కు. కప్పు కాఫీ లభించుటయే గొప్ప లక్కు" అని కాఫీ గురించి వర్ణించారు ప్రముఖ సినీకవి జొన్నవిత్తుల. కాఫీకి ఉన్న గొప్పతనం అలాంటిది. ఇప్పటివరకూ భాగ్యనగరంలో ఇరానీచాయ్​, కాఫీడేలోని కాపిచినో, ఇన్​స్టెంట్​ కాఫీ మాత్రమే చూశారు. తేనీరు ప్రియులు ఉవ్విల్లూరించటానికి అందుబాటులోకి వచ్చింది సరికొత్త టర్కీ కాఫీ. తాగాలంటే టోలీచౌకీ జోర్దాన్ షవార్మా స్టాల్‌కు వెళ్లాల్సిందే.

ఇసుకపై కాస్తారు..

దీర్ఘ చతురస్రాకారపు బాండిలో పూర్తిగా ఇసుక నింపి, వేడి చేస్తారు. పాలు, సౌదీ నుంచి తీసుకొచ్చిన కాఫీ పొడి, పంచదారను సులువుగా పట్టుకునేందుకు వీలుగా ఉన్న రెండు రాగి పాత్రల్లో వేసి ఇసుకపై పెడతారు. ఇలా చేస్తేనే ప్రత్యేక రుచి వస్తుందంటున్నారు దుకాణదారుడు.

సౌదీ కాఫీ పొడితో వాహ్!

సౌదీలో ఈ కాఫీని ఎక్కువగా తాగుతుంటారు. ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించిన అద్నన్.. సౌదీ నుంచి కాఫీ పొడిని తెప్పించి మరీ తయారు చేయిస్తున్నారు. వినూత్నంగా ఇసుక మీద కాఫీ తయారు చేయడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి నగరవాసులు వస్తున్నారు. రుచి బాగుందని కితాబిస్తున్నారు.

సాయంత్రం 4 నుంచి రాత్రి 12 వరకు మాత్రమే తయారు చేస్తారు. కప్పు ధర 20 రూపాయలు మాత్రమే. ఇక ఆలస్యం ఎందుకు.. టర్కీ కాఫీ రుచి చూడండి.

ఇదీ చూడండి: వామ్మో..! ఆ ఇంటికి 75 గదులు... 101 దర్వాజలు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.