స్థానిక ఎన్నికల వేళ ప్రజలను ప్రలోభాలకు గురి చేసే, అక్రమ నగదు, మద్యం సరఫరాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 52 ప్రాంతాల్లో 76 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. తొలి విడత నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా రౌడీ షీటర్లను, వివాదాస్పద నాయకులను ముందుగా బైండోవర్ చేశామన్నారు.
ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అన్నారు. నాలుగు దశల ఎన్నికల విధులకు జిల్లా వ్యాప్తంగా 2,200 మంది పోలీసు సిబ్బందిని కేటాయించామన్నారు. రిటైర్డ్ పోలీసు అధికారులు, ఎక్స్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎవరైనా వివాదాలకు పాల్పడినా.. ప్రేరేపించినా.. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: మెుదటి అంకం... నామినేషన్ల స్వీకరణ ప్రారంభం