SCR Special Trains for Sankranti: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 14న నర్సాపూర్-విజయవాడ డెమూ, 13న విజయవాడ- నర్సాపూర్ డెమూ, మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం- గుడివాడ మెమూ, గుడివాడ- మచిలీపట్నం మెమూ, 13న విజయవాడ- మచిలీపట్నం మెమూ, 14న మచిలీపట్నం-విజయవాడ మెమూ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
- ఈనెల 14న నర్సాపూర్-విజయవాడ డెమూ
- ఈనెల 13న విజయవాడ నర్సాపూర్ డెమూ
- ఈనెల 13న మచిలీపట్నం-గుడివాడ మెమూ రైలు
- ఈనెల 13న గుడివాడ మచిలీపట్నం మెమూ
- ఈనెల14న మచిలీపట్నం-గుడివాడ మెమూ రైలు
- ఈనెల14న గుడివాడ-మచిలీపట్నం మెమూ రైలు
- 13న విజయవాడ-మచిలీపట్నం మెమూ రైలు
- 14న మచిలీపట్నం-విజయవాడ మెమూ రైలు
Rush at RTC Bus and Railway stations : మరోవైపు సంబరాల సంక్రాంతికి సరదాగా జరుపుకోవాలని అంతా సొంతూళ్ల బాట పట్టారు. విద్య,ఉద్యోగం,వ్యాపారం ఇలా రకరకాల కారణాల చేత సొంతూరికి,సొంత వారికి దూరంగా ఉన్నవారంతా వారి వారి ప్రాంతాలకు పెద్ద పండక్కి పరుగులు పెడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు సొంత వాహనాల్లో వెళ్లే వారితో రహదారులు రద్దీగా మారాయి.
చర్యలకు సిద్ధమైన రవాణాశాఖ..
అధిక ఛార్జీలు వసూలు చేసేవారిపై రవాణాశాఖ చర్యలకు సిద్ధమైంది. ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ 91542 94722 ఏర్పాటు చేసింది. ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: