కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి బలవంతంగా డిశ్చార్జ్ చేశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ నుంచి నిన్న అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జ్ హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
3 రోజులు ఆస్పత్రి బెడ్ పైనే విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టును .. ధిక్కరిస్తారా అని ప్రశ్నించారు. డిశ్చార్జ్ చేయాలని డాక్టర్లపై పోలీసులు ఒత్తిడి తేవడం దుర్మార్గమన్నారు.
ఒకటికి రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. అరెస్ట్ రోజు 14 గంటలపాటు కారులో తిప్పడం నుంచి ఇప్పటి వరకు అచ్చెన్న విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సామాన్యుల నుంచి సీనియర్ ప్రజా ప్రతినిధుల వరకు ఎవరికీ స్వేచ్ఛలేదని, నిర్బంధ పాలన సాగుతోందన్నారు.
ఇదీ చదవండి: కరోనా రికార్డ్: కొత్తగా 16,922 కేసులు, 418 మరణాలు