ETV Bharat / state

శివరాత్రి సందర్భంగా భక్తులతో కళకళలాడుతున్న శైవక్షేత్రాలు - SIVARATRI NEWS IN AP

శివరాత్రి మహోత్సవాలతో రాష్ట్రంలోని ఆలయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, రథోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. వేలాదిగా ఆలయాలకు తరలివస్తున్న భక్తులు ఆది దంపతులను దర్శించుకుని తరిస్తున్నారు

శివరాత్రి సందర్భంగా భక్తులతో కళకళలాడుతున్న శైవక్షేత్రాలు

author img

By

Published : Mar 13, 2021, 4:26 AM IST

శివరాత్రి సందర్భంగా భక్తులతో కళకళలాడుతున్న శైవక్షేత్రాలు

శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో నగరోత్సవం వైభవంగా జరిగింది. ఆదిదంపతులు రథంపై సర్వాభరణాలు ధరించి భక్తకోటికి దర్శనమిచ్చారు. దుర్గామల్లేశ్వర స్వామి, భ్రమరాంభ మల్లేశ్వరస్వామి, వసంత మల్లికార్జునస్వామి ఆళయాల నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి కెనాల్‌రోడ్‌లోని రథంపై ఉంచారు.

మహిళల కోలాటాలు, సంకీర్తనలు, భజనలు, పులివేషాలు, ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్య..... వినాయకుడి గుడి వరకు ఊరేగింపు సాగింది. అడుగడుగునా భక్తులు స్వామివారికి అఖండ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా..... స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి పుష్కరిణిలో భ్రమరాంభ సమేత మల్లన్న జలవిహారం చేశారు. కర్నూలు జిల్లాలోని మహనంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున... శ్రీ కామేశ్వరీదేవి సహిత మహనందీశ్వర స్వామివారిని మయూర వాహనంపై ఊరేగించారు. యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి సతీసమేతంగా హాజరై పూజలు నిర్వహించారు. గూడూరు మండలం చనుగొండ్లలో నాగలింగేశ్వరస్వామి రథోత్సవానికి కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ హాజరయ్యారు. గ్రామంలో జాతర సందర్భంగా క్రికెట్, కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

విశాఖ శారదాపీఠంలో దక్షిణామూర్తికి ఏకాదశ రుద్రాభిషేకం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. పీఠాధిపతి స్వరూపానందేంద్ర శ్రీ చంద్రమౌళీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. రావికమతంలోని కల్యాణ పోతురాజు ఆలయంలో జరిగిన చండీయాగంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలోని కాశీవిశ్వేశ్వరస్వామి రథోత్సవానిక హాజరైన ఉపసభాపతి కోన రఘుపతి దంపతులు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బ్రహ్మరాత్రిని పురస్కరించుకుని..... సోమస్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబదేవి..... తెప్పలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాల్లో భక్తుల తలపై కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య సాగింది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. వేలాది మంది భక్తులు స్వామివారి నామస్మరణతో రథాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా సాగింది.

ఇవీ చదవండి

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డబ్బు పంచుతున్న ఉపాధ్యాయుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.