గాల్లో ఎగిరే విమానం రోడ్డు మీదకొచ్చింది. దిల్లీకి చెందిన ఒక వ్యాపారి పాత విమానాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి వాటిని వినియోగించి హోటల్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ సమీపంలోని గూడవల్లి కూడలిలో కార్మికులు.. ఆ పాత విమానానికి కొత్త రూపు వచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. మూడు నెలల్లో విమానాన్ని బాగు చేసి దాంట్లో హోటల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విమానాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. చిన్నారులు, యువత ఫొటోలు దిగుతున్నారు.
రోడ్డుపై విమానం.. ఆశ్చర్యపోయిన జనం - etvbharat
ఆకాశంలో చక్కర్లు కొట్టే లోహ విహంగం ఒక్కసారిగా రోడ్డు పక్కన దర్శనమిచ్చింది . గాల్లో ఎగిరే భారీ విమానం ఒక ట్రాలీ మీద రోడ్డు పక్కన ఉండటం చూపరులను ఆశ్చర్యపరిచింది. విమానాన్ని చూసేందుకు అక్కడికి చేరుకున్న జనాలు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
గాల్లో ఎగిరే విమానం రోడ్డు మీదకొచ్చింది. దిల్లీకి చెందిన ఒక వ్యాపారి పాత విమానాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి వాటిని వినియోగించి హోటల్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ సమీపంలోని గూడవల్లి కూడలిలో కార్మికులు.. ఆ పాత విమానానికి కొత్త రూపు వచ్చేలా మరమ్మతులు చేస్తున్నారు. మూడు నెలల్లో విమానాన్ని బాగు చేసి దాంట్లో హోటల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విమానాన్ని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. చిన్నారులు, యువత ఫొటోలు దిగుతున్నారు.
Body:నరసన్నపేట
Conclusion:9440319788