బంగారాన్ని అక్రమంగా తరలించే ముఠాలు రకరకాలుగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చాక్లెట్లు, బిస్కెట్లు, పల్లి కాయాలు, ద్రవ రూపం, ఇలా అనేక విధాలుగా బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని వారి ప్యాంటు నడుము పట్టీలో దాచి తరలిస్తుండగా.. అధికారులు గుర్తించి వారిని పట్టుకున్నారు.
రియాద్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.18.07 లక్షల విలువైన 369.8 గ్రాముల పుత్తడి అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు.