పౌరసరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ పరిశీలించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. పౌరసరఫరాల శాఖ అధికారులు.. రేషన్ డెలివరీ వాహనాలను తీసుకొచ్చారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్.. వాహనంలోని సదుపాయాలను.. ఎస్ఈసీకి వివరించారు.
డోర్ డెలివరీ చేసే విధానాన్ని తెలియజేశారు. ఈ వాహనాల ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తూ.. ఎస్‌ఈసీ ఆదేశాలివ్వగా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పథకం సంబంధిత వివరాల్ని ఎస్‌ఈసీ ముందు ఉంచాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
ఇదీ చదవండి: