రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణా కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) కమిషనర్ శ్రీ వినీత్ బ్రిజ్ లాల్ అన్నారు. అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ముమ్మర తనిఖీలు జరుపుతూ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని నిఘా ఏర్పాటుతో రాత్రివేళల్లో గస్తీని ముమ్మరం చేశామన్నారు.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాలుగు నెలల పనితీరు పై రివ్యూ నిర్వహించారు. ఈ నాలుగు నెలల కాలంలో చేపట్టిన అనేక ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. రానున్న రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంస్థ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని , సమీక్ష నిర్వహించడం తోపాటు ఉత్తమ ప్రతిభ కనబర్చిన జిల్లా అధికారులను అభినందించారు. పూర్తి నిబధ్ధత, సమగ్రత తో తమ వృత్తి నిర్వహించాలని శ్రీ వినీత్ సూచించారు.
ఇదీ చదవండి: 'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'