కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో.. గ్రామ సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన స్థలం వివాదానికి దారి తీసింది. 2005లో నివేశన స్థలంగా ప్రభుత్వం తమకు ఆ భూమిని కేటాయించిందని.. గూబగుంట కృష్ణమాచారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శిల్పాలను తయారుచేస్తూ.. పాతికేళ్లుగా ఇక్కడ జీవిస్తున్నామని తెలిపారు.
తమ స్థలాన్ని అధికారులు బలవంతంగా లాక్కొని.. అన్యాయం చేస్తున్నారని ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుమారు పది లక్షల రూపాయల విలువైన శిల్పాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి సమస్య చెప్పుకుందామని ప్రయత్నిస్తే.. గృహ నిర్బంధం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: దీపావళిలోగా లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలి: రామకృష్ణ