పాఠశాలకు వెళ్లడానికి దారిలేక కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరులో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పక్కనున్న స్థలంలో నుంచి గతంలో వారు బడికి వెళ్తుండేవారు. ఆ భూమి తనదంటూ.. ఓ వ్యక్తి దారివ్వడానికి నిరాకరించాడు. నవంబర్ నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లనున్నారు. ప్రస్తుత పరిస్థితితో ఏం చేయాలో పాలుపోవడం లేదని తల్లిందండ్రులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి: