భారతదేశంలో తొలిసారిగా విద్యుత్ ద్విచక్ర వాహనానికి భారతీయ స్టేట్ బ్యాంకు రుణం మంజూరు చేయటం సంతోషంగా ఉందని అవేరా ఆ సంస్థ సీఈవో వెంకటరమణ అన్నారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎస్బీఐ శాఖ డివిజనల్ మేనేజర్ అరుణ్ కుమార్ సాహు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగేంద్ర కుమార్ చేతుల మీదుగా రుణ మంజూరు పత్రాన్ని వెంకటరమణ అందుకున్నారు. గతంలో విద్యుత్ ద్విచక్రవాహనాలకు బ్యాంకులు అందించిన దాఖలాలు లేవని... దేశంలో తొలిసారిగా అవేరా వాహనాలకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు వచ్చిన ఎస్బీఐ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రుణం ద్వారా కొనుగోలు చేసిన తొలి వాహనాన్ని సత్య గంగాధర్ అనే వినియోగదారునికి బ్యాంకు అధికారులు అందజేశారు.
ఇదీ చూడండి