ETV Bharat / state

కరోనా కాలం.. మహిళల పొదుపు మంత్రం

కరోనా నేర్పిన పాఠాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లలు-పెద్దలు, పేద-ధనిక అందరిలోనూ మార్పుకు కారణం అయ్యింది. శుభ్రత, పొదుపు విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. కృష్ణాజిల్లా కలిదిండి మహిళలు గృహావసరాల్లో వృథాను అరికడుతూ, ఖర్చులు తగ్గిస్తూ రోజువారీ జీవనంలో మార్పులు చేసుకున్నారు.

author img

By

Published : Oct 8, 2020, 6:50 PM IST

savings in corona time
కష్టంలోనూ..ఇష్టంగా.. పొదుపు

చేద్దామన్నా..చేతినిండా పనిలేక..కడుపు నిండా తిందామన్నా..కాసులు సరిపడా చాలక..కష్టమొచ్చినా చలించక..కరోనాను ఎదిరిస్తూ..కలిసొచ్చే కాలం కోసం కుదుటపడేందుకు యత్నిస్తూ..అంతంతమాత్రం సంపాదనలు ఆకాశాన్నంటిన ధరలు ఆశలకు హద్దులు గీసి ఖర్చులకు పద్దులు రాసి అత్యవసరాలే ముద్దంటూ ముందుకు సాగుతోంది మధ్యతరగతి మహిళ..! ఆమాత్రం రాబడితోనే లోటు తెలియనీకుండా చేటులేని వంటకాలతో కొత్త రుచులను అద్ది కడుపు నింపుతోంది..! భారమని భావించక బాధ్యతతో మసలుతూ ఇల్లంతా చక్కబెడుతోంది!!

ధర తక్కువ కూరగాయలే ప్రాధాన్యం

కరోనా వైరస్‌ రాకముందు కూరగాయల ధరలు నామమాత్రంగా ఉండేవి. ఏప్రిల్‌ నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడున్న ధరలు చూస్తుంటే భయం పుడుతోంది. ఇంతకుముందు ఫలానావి తీసుకురావాలని ముందుగానే అనుకొని సంతకు వెళ్లేవాళ్లం. ప్రస్తుత పరిస్థితుల్లో సంతకెళ్లిన తరవాతే ఏం కొనాలి అనేది నిర్ణయించుకోవాల్సి వస్తోంది. నచ్చింది కొనాలంటే ధర అందుబాటులో ఉండడంలేదు. ఆ రోజుకి ఏది తక్కువ ఉంటే అవే కూరగాయలు కొంటున్నాం. కిలో తీసుకోవాల్సినవి అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం. అలాగని తక్కువ చేసుకోవడం కాదు.. వృథాను అరికడుతున్నా. పరిస్థితులకు అనువుగా మసులుకుంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

- చవల స్వర్ణరేఖ, కోరుకొల్లు

బయటి ఆహారం మానేశాం

ఉదయం టిఫిన్‌, సాయంత్రం ఫాస్ట్‌ఫుడ్‌ తీసుకురావడం ఎప్పటినుంచో అలవాటుగా మారింది. దీనికి నెలనెలా మూు వేలకుపైగా ఖర్చయ్యేది. ఇది కాకుండా హోటల్‌ నుంచి బిర్యానీలకు అదనంగా వెచ్చించాల్సివచ్చేది. ఇప్పుడవన్నీ మానివేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఎప్పుడైనా కొత్తగా ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో రుచికరంగా తయారు చేస్తున్నా. పిల్లలు కూడా ఇంటి వంటకానికి అలవాటు పడుతున్నారు. భవిష్యత్తులో ఇది వారికి మంచి చేస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా చాలావరకు తగ్గాయి. దానిద్వారా మరికొంత కనిపించని ఖర్చు తగ్గినట్లే.

- గంగుల వెంకటలక్ష్మి, సానారుద్రవరం

ఇంటిపట్టునే..

ఊర్లు వెళ్లడం, శుభ కార్యక్రమాలను ఎక్కువగా హాజరుకావడం వల్ల గతంలో నెలకు రూ.10,000 వరకు ఖర్చు చేసేవాళ్లం. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడికీ వెళ్లడం కుదరలేదు. అన్‌లాక్‌ తరవాత బయటకు వెళ్లే వీలున్నా ఇంటిపట్టునే ఉంటున్నాం. దగ్గరవాళ్ల ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినా వెళ్లడం లేదు. ప్రయాణాలు తగ్గించడం ద్వారా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. ఇంటి ఖర్చును అదుపు చేసుకోవడానికీ అంతే బాధ్యత తీసుకోవాలి. ఈ రోజుల్లో ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. పిల్లలకూ ఇది అలవడుతుంది.

- అంకెం వీరవెంకటనాగలక్ష్మి, కోరుకొల్లు

విద్యుత్తు వాడకం తగ్గించుకున్నాం

ఇటీవలకాలంలో వీలైనంత వరకు ఖర్చుల్ని అదుపు చేయడానికే చూస్తున్నా. మా ఇంట్లో విద్యుత్తు వాడకం ఎక్కువగానే ఉంటుంది. దానిని కూడా పొదుపుగానే వాడుతున్నా. మిక్సీలు, గ్రైండర్లను వినియోగించడం లేదు. మినపప్పు, పెసలు, చట్నీ, మసాలా లాంటివి రుబ్బడానికి రోలు, చనికెలి వంటివాటిని వాడుతున్నా. గతంలో మాదిరిగా పగలు లైట్లు, ఫ్యాన్లు వేయట్లేదు. రాత్రి వేళ ఎటూ తప్పదు. ఒక్క విద్యుత్తు అనేకాదు.. మంచినూనె, పంచదార నుంచి మటన్‌, చికెన్‌ వరకు అన్నింటా తగ్గించుకున్నాం. ఇది హెచ్చులకు పోయే రోజులు కాదు. ఒదిగి ఉండడం, పొదుపుగా చేసుకోవడం అన్నివిధాలుగా మేలు చేస్తుందని నా భావన.

- కొల్లాటి లక్ష్మి, పెదలంక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.