ప్రకృతి ప్రసాదితమైన దేశీయ వంగడాలను వినియోగం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని.. సేవ్ సంస్థ అధ్యక్షులు మేకపొత్తుల విజయరాం అన్నారు. ప్రకృతి సాగుపై కృష్ణా జిల్లా గూడూరు మండలం అయిదుగుళ్ల పల్లిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ప్రకృతి సాగు ద్వారా పండించిన బహురుపి, నావర ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఘగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు నయమవుతున్నాయని తెలిపారు. ఐదుగుళ్లపల్లి గ్రామానికి చెందిన సూరయ్య నెలన్నరపాటు దేశీయ వంగడాలతోనే 50 మందికి భోజన సదుపాయం కల్పించటం అభినందనీయమన్నారు. పది రోజుల వ్యవధిలోనే వారిలో పలువురి ఆరోగ్యంలో.. మార్పులు రావటం ప్రశంసనీయమన్నారు.
ఇదీ చదవండి: