ETV Bharat / state

స్టాక్​పాయింట్​లు పెట్టినా తీరని ఇసుక కష్టాలు

కృష్ణానదికి వచ్చిన వరదల వలన ఇసుక లభ్యం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్​లు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కూడా ఇసుక లభ్యం కాకపోవడంతో ఒక్క ట్రక్కు ఇసుకను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

sand problems
sand problems
author img

By

Published : Nov 4, 2020, 8:17 PM IST

కృష్ణాజిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గంలో ఘంటసాల మండలం, శ్రీకాకుళం, అవనిగడ్డ మండలం, అవనిగడ్డలో ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్​లు ఏర్పాటు చేసింది. ఇసుకను లారీల్లో అవనిగడ్డ స్టాక్ పాయింట్​కు తేవడం.. అక్కడ అమ్మకాలు కొద్ది రోజులు జరిపినా ఆ తర్వాత ఇసుక స్టాక్ పాయింట్ మూతబడింది. ఘంటసాల మండలం, శ్రీకాకుళంలో స్టాక్ పాయింట్ వరదల కారణంగా గత రెండు నెలలుగా ఇసుక లేక అమ్మకాలు నిలిచిపోయాయి. నది పక్కన గ్రామాలకు ఎడ్లబండ్లతో ఇసుక తరలిస్తే అధికారులు ఏమి అనడం లేదని నాగాయతిప్ప గ్రామానికి ఇసుక ఎడ్లబండ్లతో తోలుకుంటామని అర్జీలు ఇస్తున్నా.. కనీసం వాటిని తీసుకోవడంలేదని నాగాయతిప్ప గ్రామస్థులు వాపోతున్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో ఇసుక కొరత ఎక్కువగా ఉండటంతో తాపీ కార్మికులకు సైతం పనులు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్​లో ఉండటం వలన కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాల వలన నది ఒడ్డు ఎక్కువగా కోతకు గురయ్యాయి. దీంతో నదిలో ఇసుక తవ్వకాల వలన భూగర్బ జలాలు తగ్గిపోవడం.. సముద్రపు నీరు పంట పొలాల్లోకి రావడం వలన పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మోపిదేవి మండలంలో కొందరు రాత్రి సమయంలో అలాగే తెల్లవారుజామున యథేచ్చగా ఇసుకను ఎడ్లబండ్లతో తోలకం చేస్తున్నారు. కోసూరు వారిపాలెం గ్రామంలో గత పది రోజులుగా ఇసుకను అక్రమంగా తరలించడంతో రెవెన్యూ అధికారులు నదిలోకి వెళ్ళే బాటలో కంచె వేసి నదిలో ఇసుక తవ్వకాలు చేస్తే చట్టరీత్యా నేరం అని.. అక్రమంగా ఇసుక తరలిస్తే జరిమానా విధిస్తామని మోపిదేవి ఎమ్మార్వో కె. మస్తాన్ తెలిపారు.

ఇదీ చదవండి: పసిడి ప్రియం.. భారీగా దిగొచ్చిన వెండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.