ప్రధాన నదుల నుంచి కూడా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వాగులు, వంకల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఇసుక తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇకపై ప్రధాన నదులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామస్థులు తమ అవసరార్ధం ఎడ్లబండ్లపై ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు సవరించారు. ఇలా తీసుకొచ్చిన ఇసుక నిల్వ చేసినా.. బ్లాక్‌మార్కెట్‌కు తరలించినా, వాణిజ్య అవసరాలకు వినియోగించినా జరిమానా విధించనున్నట్లు గనులశాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి