ETV Bharat / state

'ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం' - రైతు భరోసా కేంద్రాలు

ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గ్రామ స్థాయిలో రైతులకు.. వ్యవసాయ అనుబంధ శాఖల సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

rythu bharosa centers in ap
rythu bharosa centers in ap
author img

By

Published : May 12, 2020, 2:34 PM IST

ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గ్రామ స్థాయిలో రైతులకు.. వ్యవసాయ అనుబంధ శాఖల సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

రైతులకు విస్తరణ సేవలందించడంలో రైతు భరోసా కేంద్రాల కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని గ్రామ సచివాలయ కేంద్రాల్లో ఆర్బీకేలు ఏర్పాటు చేశామన్నా అధికారులు ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విత్తనాల, ఎరువులు వంటివి గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

ఆర్బీకే కేంద్రాల్లో కియోస్కుల ఏర్పాటు చేస్తున్నామని, ఎరువులు, విత్తనాలను కియోస్కుల ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుంచి గ్రామ స్థాయిలోనే విత్తనాల సరఫరా చేయనున్నామని తెలిపారు. మార్కెట్లో ధరలెలా ఉన్నాయనే విషయం కూడా కియోస్కుల ద్వారా తెలుస్తుందన్నారు. వాతావరణ సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఆర్బీకే సెంటర్లు మార్కెటింగ్ కేంద్రాలుగా రూపాతంరం చెందేలా ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని వివరించారు. కియోస్కుల ద్వారా అమ్మకాలు జరిపే వాటికి నాణ్యత ఉంటుందన్నారు. దానికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందన్నారు. కియోస్కుల ద్వారా జరిపే క్రయ విక్రయాలతో ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్టుకు తరలి వెళ్లే అవకాశాలు తక్కువ ఉంటుందని చెప్పారు.

ఈ సీజన్‌ కోసం 2.14 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్దం చేసి గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచనున్నామని అధికారులు తెలిపారు. ఆర్బీకేలకు నోడల్ ఏజెన్సీగా అగ్రోస్ వ్యవరిస్తుందని.. ఈ-కామర్స్ యాక్టివిటీలా ఆర్బీకే ద్వారా సేవలందిస్తామని ఆగ్రోస్‌ ఎండీ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల వల్ల రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గొడౌన్లు సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్బీకే సెంటర్ల ద్వారా వ్యవసాయ పని ముట్లు, యంత్రాల కొనుగోళ్లు, అద్దెకిచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దిల్లీ ఎయిమ్స్​ నుంచి మన్మోహన్​ సింగ్​ డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.