ETV Bharat / state

కోరింది ఇవ్వకుంటే.. తిరుమలకూ బస్సులు ఆపేస్తాం!

50 శాతం ఫిట్​మెంట్​తో వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మె నిర్వహించనున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఐకాస నేతలను చర్చలకు ఆహ్వానించారు.

author img

By

Published : Feb 5, 2019, 5:01 PM IST

rtc workers strikes

డిమాండ్ల సాధన కోసం రేపటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. 50 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా ఆదుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే సమ్మె తప్పదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ దామోదరరావు హెచ్చరించారు. తిరుమల కొండపైకీ బస్సులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల సమ్మె యత్నాలను విరమింపచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఐకాస నేతలు, యాజమాన్యాన్ని మంత్రి అచ్చెన్నాయుడు చర్చలకు ఆహ్వానించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో నేటి సాయంత్రం 6 గంటలకు మరోసారి చర్చించనున్నారు. కార్మిక ఐకాస నేతలతో పాటు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఉన్నతాధికారులు హాజరవుతారు.

Intro:ap_cdp_17_05_rahadari_bhadratha_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు మెరుగైన వేతన సవరణ చేయకుంటే అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు కుమార్ హెచ్చరించారు. సమ్మె సన్నాహక దినాన్ని పురస్కరించుకొని కలప డిపో ఎదుట ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . ఆర్టీసీ నష్టాలు తగ్గించాలంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కార్మికులకు 50 శాతం వేతన సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ క్రమబద్దీకరించాలని కోరారు. పదేళ్లపాటు ఆర్టీసీకి ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని తెలిపారు. యాజమాన్యం ఇప్పటికైనా దిగివచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు.

Body:ఆర్టీసీ ఐకాస ధర్నా

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.