పౌరసత్వ సవరణ బిల్లును రాష్ట్రంలో ఆమోదించబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ దాసరి భవన్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తుంటే... వైకాపా ఎంపీలు బిల్లుకు మద్దతు పలకడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ఎన్ఆర్సి బిల్లును రాష్ట్రంలో ఆమోదించేలా.. అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ముస్లిం సంఘాల నాయకులు, యువజన సంఘాలు పాల్గొన్నాయి.
ఇవీ చూడండి: