Round Table meet on ST Reservations: రాష్ట్రంలో అటవీ సంపద, సహజ వనరులను దోచుకునేందుకు, ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే.. వైసీపీ ప్రభుత్వం బీసీ-ఏ జాబితాలో ఉన్న వాల్మీకి, బోయ, బెంతూ, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేసిందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ ఆరోపించారు. విజయవాడలో ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గతంలో వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక లోకూర్ కమిటీ ప్రమాణాలకు భిన్నంగా ఉందని రిజిస్టర్ జనరల్ తిరస్కరించారని ఆయన తెలిపారు.
మైదాన ప్రాంత గిరిజనులకు, షెడ్యూల్డ్ ఏరియాలో నివసించేవారికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరిస్తే గిరిజన, ఆదివాసుల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చాలంటే 1965లో లోకూర్ కమిటీ కొన్ని ప్రామాణికాలను సూచించిందని ఆయన వివరించారు. వాల్మీకి, బోయలు ఆ కమిటీ ప్రామాణికాలకు భిన్నమైన ప్రతిపాదనలు కలిగి ఉన్నాయన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. వాల్మీకి, బోయల వెనుకబాటును దృష్టిలో పెట్టుకొని వారి ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు.
"జగన్ సర్కారు రాష్ట్రంలో అటవీ సంపద సహజ వనరులను దోచుకునేందుకు, ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే బీసీ-ఏ జాబితాలో ఉన్న బోయ, వాల్మీకి, బెంతూ, ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం చేసింది. గతంలో వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక లోకూర్ కమిటీ ప్రమాణాలకు భిన్నంగా ఉందని రిజిస్టర్ జనరల్ తిరస్కరించారు. మైదాన ప్రాంత గిరిజనులకు, షెడ్యూల్డ్ ఏరియాలో నివసించేవారికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఆదివాసుల, గిరిజనుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఎస్టీ జాబితాలో చేర్చాలంటే 1965లో లోకూర్ కమిటీ కొన్ని ప్రామాణికాలను సూచించింది. వాల్మీకి, బోయలు ఆ కమిటీ ప్రామాణికాలకు భిన్నమైన ప్రతిపాదనలు కలిగి ఉన్నాయి." - చిలుక చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: