ETV Bharat / state

రోబో రెస్టారెంట్... ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో...

హాయ్​.. మా హోటల్​కు వచ్చిన అతిథులకు స్వాగతం. రండి రండి వెళ్లి కూర్చొండి. మీరేం తింటారో చెప్పండి. మీకేం కావాలో తెచ్చిస్తాం. ఈ మాటలనేది మనుషులు కాదండోయ్​... మరమనుషులు. అదేంటి సర్వర్లు కదా ఈ ప్రశ్నలు వేసేది అనుకుంటున్నారా..? రోబోలు ఆహ్వానించడమేంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది చదవండి.

Robots at a restaurant in Vijayawada
రోబో రెస్టారెంట్... ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో...
author img

By

Published : Jul 28, 2021, 4:34 AM IST

సాంకేతిక హంగులతో రోబోటిక్‌ రెస్టారెంట్లు దూసుకువస్తున్నాయి. కరోనా మహమ్మారి నేర్పిన భౌతిక దూరం పాఠంతో రెస్టారెంట్లలో రోబోలు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రధాన నగరాలకే మాత్రమే పరిమితమయిన రోబో రెస్టారెంట్లు రాష్ట్రంలోనూ క్రమేణా పెరుగుతున్నాయి. విజయవాడలోని ఓ రెస్టారెంట్లో కొత్తగా ప్రవేశ పెట్టిన రోబోలు వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. లోనికి వచ్చే అతిథులకు స్వాగతం పలకడం, సిద్ధం చేసిన ఆహారాన్ని నేరుగా వారి టేబుల్‌ వద్దకు తీసుకెళ్లి అందించడం వంటి సేవలు చిన్నారులతో పాటు, పెద్దలనూ ఆశ్చర్యపరుస్తున్నాయి.

రోబో రెస్టారెంట్... ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో...

విజయవాడతో పాటు ఒంగోలు, రాజమండ్రి రెస్టారెంట్లలో ప్రయోగాత్మకంగా రోబో సేవలు మొదలయ్యాయి. ఒక్కో రోబో ఖరీదు ఆరు లక్షల వరకూ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ రోబోలు కిచెన్‌లో తయారైన వంటకాలను నేరుగా వినియోగ దారుల టేబుల్‌ వద్దకు చేరుస్తున్నాయి. భోజనప్రియులను ఆకట్టుకుంటున్న ఈ రోబోలు పుడ్‌ సెర్వింగ్‌లో వినియోగదారులకు కావాల్సిన ఆహారాన్ని నేరుగా వాటికే చెప్పుకునే వెసులుబాటు ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతానికి ఆహారాన్ని తీసుకెళ్లి ఇచ్చే సదుపాయమే వాడుకలో ఉంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి

ఆక్వా రైతుల కోసం ఆచార్యుని వినూత్న ఆవిష్కరణ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.