Roads Damage in Gudivada: బస్సు కుదిపేస్తే.. అందులోని ప్రయాణికుల ముఖచిత్రాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడుగుకో గొయ్యి.. గజానికో గుంత ఉంటే ప్రయాణం ఎంత నరకమో అర్థంచేసుకోవచ్చు.. ఈ రహదారులపై వాహనాలు మెలికలు తిరుగుతున్నాయంటే.. డ్రైవర్ ఎన్ని ఫీట్లు చేస్తున్నాడో ఊహించుకోవచ్చు. ఇదీ కృష్ణా జిల్లా గుడివాడ వెళ్లే రోడ్డు దుస్థితి.. బూతుల నేతగా ఎమ్మెల్యే ఎంత ఫేమస్ అయ్యారో.. గోతులదారిగా రాష్ట్రంలో గుడివాడ రోడ్డు అంత ప్రాచుర్యం పొందింది.
Vijayawada to Gudivada Worst Roads: విజయవాడ నుంచి గుడివాడ.. 45 కిలోమీటర్లు ఉంటుంది. పునాదిపాడు క్రాస్ వరకూ 16 కిలోమీటర్లు జాతీయ రహదారే. ఆ తర్వాత 29 కిలోమీటర్లు.. రాష్ట్ర ప్రభుత్వ రహదారి. అదే నరకదారి. రోడ్డు బాగుంటే.. పునాదిపాడు నుంచి అక్షరాలా అరగంటలో గుడివాడ చేరుకోవచ్చు! నాలుగేళ్ల క్రితం.. అలాగే ఉండేది. ఇప్పుడు గంటన్నర పడుతోంది. వాహనవేగం 20 కిలోమీటర్లు దాటితే గొప్పే. పునాదిపాడు- గుడివాడ ప్రధాన మార్గంలో.. 20 గ్రామాలకు వెళ్లే లింక్ రోడ్లు కలుస్తాయి.
Damaged Roads: అధ్వానంగా రహదారులు.. బటన్ నొక్కు జగనన్నా..!
Gudivada Damaged Roads: ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు, వేతన జీవులు.. అటు విజయవాడగానీ, ఇటు గుడివాడగానీ వెళ్లాలంటే ఈ రోడ్డే దిక్కు. అలాంటి రోడ్డులో గజంలోతు గుంతలు అడుగుకొకటి.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ రోడ్డులో నిత్యం ప్రయాణించేవాళ్లకు.. నూరేళ్ల ఆయుష్షు ఉన్నా.. దినదిన గండమే. ఎంత పెద్ద వాహనాలైనా ఈ రోడ్డులో కుయ్యోమొర్రో అనాల్సిందే. ఆర్టీసీ బస్సెక్కితే ఆ కుదుపులకు ప్రయాణికులు కూసాలు కదలాల్సిందే.
People Facing Problems with Damaged Roads: వాహనాల సామాన్లూ చెక్ చేసుకోవాల్సిందే. కొన్నిచోట్లయితే భూకంప ప్రాంతాల్లో ఉన్నట్లు.. రోడ్ల మధ్యలో ఎగుడుదిగుళ్లుగా మారాయి. ఫలితంగా.. వాహనాలు ఇలా అష్టవంకర్లు తిరగాల్సి వస్తోంది. ఐనా.. కొన్ని వాహనాల నాలుగు టైర్లు నేలకు ఆనడం లేదు. రోడ్డు కోసం వెతుక్కుంటూ డ్రైవింగ్ చేసే క్రమంలో కొన్ని వాహనాలు.. ఇలా రోడ్డు పక్కనున్న పంట కాల్వల్లోకి దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో పలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు.. పంట కాల్వలోకి దూసుకెళ్లాయి.
Road Construction in One Night: పవన్ పర్యటన.. అవనిగడ్డలో రాత్రికి రాత్రే రహదారి నిర్మాణం..
Gudivada Roads: చివరకు ఆర్టీసీ యాజమాన్యమే బస్సులు తగ్గించుకుంది. ప్రజలకు ఆటోలో దిక్కవుతున్నాయి. ఆటోవాలాలు కూడా.. ఏరోజుకారోజు బతుకు జీవుడా అంటూ ఇల్లు చేరుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. గుడివాడ నా అడ్డా.. అని జబ్బలు చరిచే ఎమ్మెల్యే కొడాలినాని పట్టించుకోలేదా? ప్రభుత్వం ఏమీ చేయలేదా? అంటే.. చేయకేం.! పునాది పాడు క్రాస్ ప్రారంభంలోనే.. ఇలా హెచ్చరిక బోర్డు పెట్టి వదిలేశారు. కానీ రోడ్డుపై రోజుకో రక్తపు మరక చూడలేక.. స్థానికులే ఓ ప్లాస్టిక్ డబ్బా అడ్డుగా పెట్టి.. వాహనాలు పక్కగా వెళ్లేలాచేశారు.
Kodali Nani Comments on Road Construction: గుడివాడ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. సుదీర్ఘకాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జగనన్న వస్తున్నాడు.. ఈ రోడ్డు వేసేస్తాడంటూ గత ఎన్నికల ముందు.. ఊరూరా హామీ ఇచ్చారు కొడాలి నాని. రహదారి విస్తరణ దేవుడెరుగు.. ఉన్న రోడ్డుకే ఇలా తూట్లు పడితే తట్టమట్టి కూడా వేయించలేదు..! పైగా రెండున్నరేళ్లు మంత్రి పదవి నిర్వహించినా.. ప్రజలను గోతుల నుంచి గట్టెక్కించలేకపోయారు. కేవలం విపక్షాలపై నోరు పారేసుకోవడమేకాకుండా.. నోరు తెరిచి జగన్‌ను నిధులు అడగలేదా? అడిగినా ఇవ్వలేదా?.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Roads in Nellore: చెరువులా..! నెల్లూరు రహదారులా..? రోడ్లపై మడుగులో కూర్చుని టీడీపీ నేతల నిరసన