32 జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కృష్ణాజిల్లా నందిగామ పోలీసులు.. పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం రోడ్డు మీద పడుతుందని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు కొనివ్వాలని అన్నారు. డ్రైవింగ్ చేస్తున్న వారు తప్పనిసరిగా లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే రోడ్డు మీదకి రావాలని తెలిపారు. ఈ ర్యాలీలో మహిళా పోలీసులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు