ETV Bharat / state

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...12 మంది మృతి

author img

By

Published : Jun 17, 2020, 6:27 PM IST

Updated : Jun 17, 2020, 8:52 PM IST

కృష్ణాతీరంలో...ఆహ్లాదకర వాతావరణం మధ్య కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలోని యోగానంద లక్ష్మి నరసింహస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. వేదాద్రి కొండపై నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. చీకటిపడేలోగా స్వస్థలాలకు చేరుకునేందుకు 24 మంది ట్రాక్టరులో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వేదాద్రి గుడి నుంచి అర కిలోమీటరు దూరం దాటకముందే- ఓ లారీ మృత్యుశకటంలా దూసుకొచ్చి...ట్రాక్టర్​ను ఢీకొంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు, క్షతగాత్రులంతా ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లాకు చెందిన వాసులు. చనిపోయిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Road accident in Krishna district
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత ప్రధాన రహదారి మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా మధిర వెళ్తున్న ట్రాక్టరును... ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొట్టింది. వేదాద్రిలోని యోగానంద లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి సరిగ్గా అర కిలోమీటరు దూరంలోపే ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టరు పక్కకు ఒరిగిపోయింది. దాని ట్రక్కు బోల్తాపడింది. ట్రాలీలోని ప్రయాణికులంతా చెల్లాచెదురయ్యారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు.

వారంతా గోపవరం వాసులే...

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం తొండల గోపవరం నుంచి వేమిరెడ్డి గోపిరెడ్డి కుటుంబ సభ్యులు డ్రైవరుతో కలిపి 24 మంది ట్రాక్టరులో మంగళవారం రాత్రి ఏడు గంటలకు వేదాద్రికి బయలుదేరారు. రాత్రి వేదాద్రిలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేశారు. ఉదయం కృష్ణాతీరంలో స్నానం చేసిన అనంతరం స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం భోజనం వరకు ఆలయం, ఇతర పరిసరాలను సందర్శించారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకునేందుకు తిరుగుముఖం పట్టిన తరుణంలో... వారి ప్రయాణిస్తున్న ట్రాక్టరును వేదాద్రి సిమెంట్స్‌ వైపు నుంచి వచ్చిన బొగ్గు లోడు లారీ ఢీకొంది. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యంలో మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మెుత్తం మృతుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన వారు 9మంది ఉండగా...కృష్ణా జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మృతుల వివరాలు...

1. వేమిరెడ్డి పద్మావతి

2 పూడూరు ఉపేందర్ రెడ్డి

3. వేమిరెడ్డి ఉదయ్

4. గూడూరు సూర్యనారాయణ రెడ్డి

5. లక్కిరెడ్డి అప్పమ్మ

6. రాజి

7.అక్కమ్మ

8.గూడూరు రమణమ్మ

9. వేమిరెడ్డి భారతమ్మ

10. లక్కిరెడ్డి తిరుపతమ్మ

11. శీలం శ్రీలక్ష్మి

12. వేమిరెడ్డి కళ్యాణి

ఈ ప్రమాదంలో లారీ డ్రైవరుకు కూడా గాయలైనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జయ్యింది. జగ్గయ్యపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన..

వేదాద్రి ఘటనలో.... పోస్టుమార్టం పూర్తయిన మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకుపోయేందుకు... వాహన సదుపాయం కల్పించాలని మృతుల బంధువులు కోరారు. ప్రమాదానికి కారణమైన లారీ యజమానిని.... ఆసుపత్రికి పిలిపించాలని ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాల తరలింపు సహా.... ఇతర కార్యక్రమాలకు పూర్తి సహకారం పోలీస్ నుంచి ఇస్తామని సీఐ నాగేంద్ర కుమార్ వారికి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్,ఓనర్ పై కేసులు నమోదు చేస్తామన్నారు.

ప్రముఖుల సంతాపం..

కృష్ణా జిల్లా ప్రమాదంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

జగ్గయ్యపేట రోడ్డుప్రమాదంపై సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రోడ్డు ప్రమాదం పై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెుక్కు తీర్చుకొని వస్తుండగా ఘటన జరగటం బాధాకరమన్నారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కృష్ణా జిల్లా ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.‌

ఇవీ చదవండి: కల్నల్ సంతోష్ వీర మరణం: ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు

Last Updated : Jun 17, 2020, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.