కృష్ణాజిల్లా తిరువూరు మండలం చిక్కుళ్లగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను తిరువూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.