ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి - road accidents at krishna district

కృష్ణా జిల్లా నిడుమోలు జాతీయరహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

road accident at nidumolu
నిడుమోలులో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 24, 2020, 12:18 PM IST

Updated : Nov 24, 2020, 1:28 PM IST

కృష్ణా జిల్లా నిడుమోలు జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దురు మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బైక్‌పై బయలుదేరారు. కూచిపూడి సమీపంలోని నిడుమోలు జాతీయ రహదారికి చేరుకొనేసరికి ఓ కారు వెనుక నుంచి ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: ఏపీలో తాగునీటిపై పన్నుల మోత.. వచ్చే ఏప్రిల్‌ నుంచి పెంపు

Last Updated : Nov 24, 2020, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.