ETV Bharat / state

Grain purchases : రబీ ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లతో సమీక్ష.. '21రోజుల్లో చెల్లింపులు'

Grain purchases : ఖరీఫ్ సీజన్​లో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేసినందున.. అదే స్ఫూర్తితో రబీ సీజన్​లోనూ పని చేయాలని పౌరసరఫరాల శాఖ ఎండీ వీర పాండ్యన్ యంత్రాంగానికి సూచించారు. ఆన్​లైన్ విధానంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. రైతులకు చెల్లించినట్టే.. మిల్లర్లకు కూడా 21 రోజుల్లో చెల్లింపులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర​రావు తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 18, 2023, 7:27 PM IST

Grain purchases : ఖరీఫ్ మాదిరిగానే ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీర పాండ్యన్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

నియమ, నిబంధనలు పాటించాలి... తణుకులోని నెక్ కళ్యాణ మండపంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విషయంలో చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీర పాండ్యన్ మాట్లాడుతూ గడిచిన ఖరీఫ్ సీజన్లో రైస్ మిల్లర్లు సక్రమంగా కొనుగోలు చేయడం వల్ల ముఖ్యమంత్రి సైతం అభినందించారని చెప్పారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఆన్​లైన్ విధానంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. రైతులకు అవసరమైన సంచులను అందజేయడంతో పాటు రైతులతో నేరుగా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఫుటేజ్​ని ఎప్పటికప్పుడు అందజేయాలని వీర పాండ్యన్ ఆదేశించారు.

రైతుల మాదిరిగా 21 రోజుల్లో చెల్లింపులు.. రాష్ట్ర పౌరసరఫరాల వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు, రైస్ మిల్లర్లు అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైస్ మిల్లర్లకు చెల్లించవలసిన బకాయిలను చెల్లించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు.

కేంద్ర పౌరసరఫరాల శాఖ అనుమతించాలి... రైతులకు ధాన్యం సొమ్ములు రవాణా ఖర్చులు 21 రోజులు వ్యవధిలో చెల్లించినట్లే.. రైస్ మిల్లర్లకు 21 రోజులలో చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి అనుమతించాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. ఈ సమీక్ష సమావేశంలో పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.