ETV Bharat / state

రిజర్వుడ్ ఓటర్లు ఎటువైపో? - విజయవాడ మున్సిపల్ ఎన్నికలు అప్​డేట్స్

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో రిజర్వుడ్ ఓటర్లు కీలకం కానున్నారు. వీరు ఓటు ద్వారా ఇచ్చే తీర్పు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనుంది. ఇందులో మహిళలు, బీసీ ఓటర్ల పాత్ర ఎంతో ప్రధానం కానుంది.

vijayawada municipal elections
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు
author img

By

Published : Feb 23, 2021, 10:53 AM IST

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈసారి మహిళా ఓటర్లతోపాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓటర్లే ఎంతో కీలకంగా మారనున్నారు. నగరంలో మొత్తం 7,80,061 ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లే అధికంగా 50.61 శాతంగా ఉన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, సామజిక ఓటర్లు 50.26 శాతం ఉంటే వీరిలో బీసీ ఓటర్లే అధికం. నగరంలో బీసీ ఓటర్ల సంఖ్య 3,03,434 గా ఉంటే మొత్తం ఓటర్లలో వీరి శాతం 38.899 గా ఉంది. ప్రస్తుత పరిస్థితిల్లో మహిళా ఓటర్లతో పాటు బీసీ ఓటర్లు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థులే కౌన్సిలర్లు గా ఉండనున్నారు. నగరంలోని 64 డివిజన్లలో ఎస్టీ సామాజిక వర్గం ఓటర్లు 8,089 మంది ఉండగా, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు మాత్రం 80,597 మంది ఉన్నారు. అయితే రిజర్వ్డు సామాజిక వర్గాల ఓటర్లలో బీసీ వర్గాల ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉంది. బీసీ, ఎస్టీ, ఎస్సీ మూడు సామాజికవర్గాల ఓటర్లు అత్యధికం గా తూర్పు నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. మొత్తం 64 డివిజన్​లలో.. 51 డివిజన్​లో పురుషులకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం అభ్యర్థుల గెలుపోటమిలో వీరి ప్రభావం సుస్పష్టం కానుంది.

నగరంలో మొత్తం ఓటర్లు: 7,80,061

* పురుష ఓటర్లు: 3,85,145

* మహిళా ఓటర్లు: 3,94,794

* ఇతర ఓటర్లు: 122

*మహిళా ఓటర్ల శాతం: 50.61

మొత్తం బీసీ ఓటర్లు: 3,03,434

* బీసీ ఓటర్ల శాతం: 38.899

* ఎస్సీ ఓటర్లు: 80,597

* ఎస్సీ ఓటర్ల శాతం: 10.332

మొత్తం ఎస్టీ ఓటర్లు: 8,089

* ఎస్టీ ఓటర్ల శాతం: 1.037

* మొత్తం ఓటర్ల లో రిజర్వ్డుఓటర్ల శాతం: 50.268

నగర మేయర్ పదవి మహిళకే రిజర్వ్ కావటంతో నారీమణుల్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నిత్య జీవితంలో మహిళలు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలను పరిష్కరిస్తామనే హామీలతోనే ప్రచారాలు ముందుకు సాగుతున్నాయి.

ఇదీ చదవండి: పన్ను భారం పడకుండా ఉండాలంటే తెదేపాను గెలిపించండి: కేశినేని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.