కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వైద్య విద్యార్థులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజయవాడ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు.
ఆ దేశంలో మొత్తం 472 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారని వెల్లడించారు. వీరిలో ఏపీకి చెందిన వారు 216 కాగా.. 256 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులని వివరించారు. నెలరోజులుగా వారు సరైన వసతి, ఆహారం లేకుండా అక్కడ ఇబ్బంది పడుతున్నారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక విమానం ద్వారా వారిని వెనక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ విషయంలో స్పందించాలని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.
ఇదీ చదవండి