వరిసాగు పట్ల మంత్రి శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. వరి సోమరిపోతు వ్యవసాయమని మంత్రి వ్యాఖ్యనించటం సిగ్గుచేటన్నారు. మంత్రి మాటలు.. రైతు కష్టాన్ని అవమానించడమేనన్న ఆయన.. కష్టపడకుండా ఎలా పండించాలో శ్రీరంగనాథరాజు చెప్తే రైతులు నేర్చుకుంటారని మండిపడ్డారు.
రైతాంగానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైకాపా రెండేళ్ల పాలనలో 760 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్న ఆయన.. శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇవీ చూడండి: