ప్రైవేటు ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని.. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని మొర్సుమల్లి తండాకు చెందిన ఇద్దరు చిన్నారులకు తేలు కుట్టడంతో తల్లిదండ్రులు వారిని మైలవరంలోని మహాదేవ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అందులో ఒక చిన్నారి కోలుకోగా, బంకాడోతూ లక్కీ (5) అనే చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బాబు చనిపోతే నాలుగు గంటల వరకు తమకు చెప్పలేదంటూ బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు, బంధువుల సిబ్బందిపై తిరగబడ్డారు. విషయం తెలిసిన పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
ఇదీ చదవండి: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవకతవకలపై కమిటీ: మంత్రి జయరాం