ETV Bharat / state

registration charges Burden : మళ్లీ పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు.. వాణిజ్య సముదాయాల పేరిట.. - special burden on commercial areas

registration charges Burden : 'పెంచుకో - దంచుకో' అంటూ రిజిస్ట్రేషన్ల శాఖ మరోసారి బాదేసింది. నిర్మాణాల మార్కెట్‌ విలువను పెంపుతో... నాలుగేళ్లలో మొత్తంగా ఆరుసార్లు వడ్డించింది. వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరీ సృష్టించి.. ప్రత్యేక భారం మోపింది. ఆస్తులు కొనుగోలు చేసే పేద, మధ్యతరగతి వారిపై పన్నుల రూపేణా భారీగా వడ్డిస్తోంది. ఉమ్మడిగా ఉన్న నిర్మాణాల విలువల జాబితా నుంచి ‘వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరీ సృష్టించింది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా పెంచిన ఈ కొత్త విలువలు.. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 7, 2023, 9:20 AM IST

రిజిస్ట్రేషన్ చార్డీల పెంపు

Burden of registration charges : 'పెంచుకో - దంచుకో' అంటూ రిజిస్ట్రేషన్ల శాఖ మరోసారి బాదేసింది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా పెంచిన ఈ కొత్త విలువలు.. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. వెయ్యి చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపంలో గతానికంటే 15 వేల వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్‌ విలువను అదనంగా 2 లక్షలు చేయడం వల్ల ఈ భారం పెరిగింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటివరకు ఆరుసార్లు భారం మోపింది.

గతేడాది ఫిబ్రవరి ఒకటిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో, ఏప్రిల్‌లో 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో పరిశ్రమలు, ఇతర అంశాల ప్రాతిపాదికగా... 13 నుంచి 75 శాతం వరకు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి యూజర్‌ ఛార్జీలు పెరిగాయి. మళ్లీ జూన్‌ ఒకటి నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల విలువలను సవరించి హెచ్చించారు. ఐతే గతేడాది జూన్‌ 1నే నిర్మాణాల మార్కెట్‌ విలువలను రాష్ట్రవ్యాప్తంగా పెంచేశారు.

సినిమా హాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా భారం వడ్డించిన ప్రభుత్వం... తాటాకు, కొబ్బరాకులు, రెల్లుగడ్డితో కప్పే గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా 10 చొప్పున బాదేసింది. గ్రామీణ, పట్టణాలనే తేడా లేకుండా అప్పటి విలువలపై సగటున 5శాతం చొప్పున పెంచారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌కు పట్టణాలు - కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం చదరపు అడుగుకు 12వందలు వసూలు చేస్తుండగా... ఇప్పుడు 1400కు పెంచారు. నగర - పట్టణ పంచాయతీ పరిధిలో వెయ్యి 60 నుంచి 12వందలకు, గ్రామీణ ప్రాంతాల్లో 770 నుంచి 850కి పెంచారు. పట్టణాలు - కార్పొరేషన్‌ పరిధిలో ఐతే సెల్లారులో చదరపు అడుగుకు 860 నుంచి 900, నగర - పట్టణ పంచాయతీల్లో 780 నుంచి 800, గ్రామీణ ప్రాంతాల్లో 560 నుంచి 600గా ప్రభుత్వం సవరించింది.

ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖ పన్నులు అంతటా ఒకేరీతిలో పెరుగుతూ వస్తుండగా.... ఈసారి ప్రభుత్వం వాణిజ్య ప్రాంతాల వారీగా ప్రత్యేక భారాన్ని మోపింది. కార్పొరేషన్‌ పరిధిలో గ్రౌండ్‌ ఫ్లోరు ప్రతి చదరపు అడుగుకు 17వందలు, నగర - పట్టణ పంచాయతీల్లో 14వందల 50, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు చేశారు. ఇదే క్రమంలో మొదటి అంతస్తుకు 16వందలు, 14వందలు, 950, రెండు అంతస్తుల పైన ఉంటే 15వందలు, 13వందలు, 900రూపాయలుగా ఖరారు చేశారు. సెల్లారుకు వెయ్యి, 900, 700 చొప్పున వసూలు చేస్తారు.

ఆర్​సీసీ నిర్మాణాలు పది అడుగుల ఎత్తుకుపైగా ఉండే మల్టీప్లెక్స్, షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణాలకు 15వందలు, 12వందల 50, 900 చొప్పున వసూలు చేస్తున్నారు. పట్టణ - నగర ప్రాంతాల్లో జింక్‌ షీట్స్, మంగుళూర్‌ టైల్స్, కడప శ్లాబ్, ఇతర వాటికి చదరపు అడుగుకు 650 ఉంటే... ఇప్పుడు 700 చేశారు. మేజర్‌ - గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో ఉన్న రేట్‌ కంటే ప్రతి చదరపు అడుగుకు 20 చొప్పున పెంచగా.. చవిటి మిద్దెలకు చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ విలువ కంటే 10 రూపాయలు పెంచారు. సాధారణ సినిమా హాళ్లు, మిల్లులు, కోళ్ల ఫారాలు, తదితరాల మార్కెట్‌ విలువల్లో పెంపు లేదు. అసంపూర్తి నిర్మాణాలకు సంబంధించి పునాది స్థాయిలో ఉంటే 25శాతం, శ్లాబ్‌ స్థాయిలో 65శాతం, పూర్తయ్యే దశలో 85శాతం చొప్పున వసూలు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.