ప్రేమ విఫలమైందనో.. తల్లిదండ్రులు తిట్టారనే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా మానసిక వైద్యులంతా విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉండటం కలవరపెడుతోందని డా. అయోధ్య అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడే వారి లక్షణాలను ముందే గుర్తించి, కౌన్సిలింగ్ ఇచ్చి బాధితుల ప్రాణాలను కాపాడవచ్చన్నారు. అలాగే కుటుంబ సభ్యుల భరోసాతో 50 శాతం వైద్యం అందించవచ్చన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:అత్తింటి వారి వేధింపులకు ఆరిన 'హారతి'!