ETV Bharat / state

అన్​లాక్​ తర్వాత మళ్లీ మొదలు.. హైదరాబాద్​లో మహిళల అక్రమ రవాణా - హైదరాబాద్​లో మహిళల అక్రమ రవాణా వార్తలు

లాక్​డౌన్ అన్​లాక్ తర్వాత మహిళల అక్రమ రవాణా మళ్లీ మొదలైందని హైదరాబాద్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

women trafficking in Rangareddy district
హైదరాబాద్​లో మహిళల అక్రమ రవాణా
author img

By

Published : Nov 30, 2020, 8:01 PM IST

హైదరాబాద్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్

లాక్​డౌన్ అన్​లాక్ తర్వాత మహిళల అక్రమ రవాణా మళ్లీ మొదలైందని హైదరాబాద్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురిని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో పట్టుకున్నామని అన్నారు. ​నిందితులు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఐదుగురు బాధితులకు విముక్తి కల్పించినట్లు సీపీ చెప్పారు.

బాధితుల్లో మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్, బంగాల్​కు చెందిన మహిళలున్నారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్న మోజమ్ మండల్​ కోసం గాలిస్తున్న క్రమంలో లభించిన సమాచారంతో మరో నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరంతా బంగాల్ రాష్ట్రానికి, బంగ్లాదేశ్​కు చెందిన వారిగా గుర్తించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి .

'మా పార్టీ ఆర్చ్​ను కూల్చిన వారిపై చర్యలు తీసుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.