ఇదీ చదవండి:
జాలర్లకు వలలో 15 అడుగుల కొండచిలువ - తమ్మిలేరు ప్రాజెక్టులో కొండచిలువ
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలోని తమ్మిలేరు ప్రాజెక్టులో... మత్స్యకారులు చేపలు పట్టేందుకు వెళ్లారు. వలలు విసరగా.. బరువుగా పైకి తేలింది. పెద్ద సంఖ్యలో చేపలు వలకు చిక్కాయని అంతా ఆనందించారు. వలను ఒడ్డుకు లాగిన తర్వాత అసలు విషయం బయటపడింది. భారీ సైజులో కొండచిలువను చూసి జాలరులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆ పామును చూసేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
జాలర్లకు చిక్కిన కొండచిలువ