ETV Bharat / state

'మేము కరోనాతో చనిపోతే.. మా కుటుంబాలకు దిక్కు లేదు'

author img

By

Published : Jul 18, 2020, 5:20 PM IST

పెండింగ్ కమీషన్ ఇచ్చి, బీమా సౌకర్యం కల్పించాలంటూ రేషన్ డీలర్లు విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చామని ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు చెప్పారు.

vijayawada
విజయవాడలో రేషన్ డీలర్ల ఆందోళన

విజయవాడలో రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. కమీషన్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీమా కల్పించాలని నినాదాలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చామని ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకట్రావు చెప్పారు. కరోనాతో నలుగురు డీలర్లు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు ఆస్పత్రిలో ఉన్నారని పేర్కొన్నారు.

కరోనా వారియర్స్ గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులను కలిసి విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎంను కలిసే అవకాశం లేక పోవటంతో.. వైఎస్ విగ్రహానికి వినతిపత్రాలు అందించామన్నారు. తాము కరోనాతో చనిపోతే... తమ కుటుంబాలకు దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలని కోరారు

ఇదీ చదవండి కరోనా చెత్తబుట్టలు... నగరపాలక సంస్థ వినూత్న ఆలోచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.