విజయవాడలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి చిరు జల్లులతో పాటు..కొన్ని ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. కురుస్తున్న వర్షాలకు పలు వాగులు వంకుల పొంగి పొర్లుతున్నాయి. రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో..వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి కట్లేరు, వైర నదులకు భారీగా వరద రావటంతో దామలురు, పల్లెంపల్లె గ్రామల మధ్య రాకపోకులు నిలిచిపోయాయి.
ఇదీ చదవండి:హంద్రీనీవాకు నీళ్లు ఇవ్వండి మహాప్రభో..!