ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా " ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు" ముగింపు కార్యక్రమం జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించారు. పదో రోజు పలు వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాదయాత్ర చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలతో పాటుగా ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు.
ఇవీ చూడండి...