11ఏళ్ల బాలిక బంధువుల ఇంటికి వెళ్లొస్తానని బయటకు వెళ్లి అదృశ్యమవడం స్థానికంగా ఆందోళన రేపింది. దీనిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక విజయవాడ నుంచి బస్సులో ఏలూరు వెళ్లినట్లు గుర్తించారు. బాలికను నగరానికి తీసుకొచ్చేందుకు పోలీసుల బృందం ఏలూరు వెళ్లింది. అయితే బాలిక అక్కడికి ఎందుకు వెళ్లింది ? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి...