ETV Bharat / state

గన్నవరం ఘటనలో టీడీపీపై 4కేసులు, 11 అరెస్టులు.. వైఎస్సార్​సీపీపై 2కేసులు, నో అరెస్టులు - attack on tdp office at gannavaram

POLICE NO ACTION ON GANNAVARAM INCIDENT : గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి ఘటనలో.. పోలీసుల చర్యలు విస్తుగొలుపుతున్నాయి. ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడిలో.. ఆస్తి నష్టం జరిగి, దెబ్బలు తిన్నకార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపారు పోలీసులు. 50 మందికిపైగా.. తెలుగుదేశం కార్యకర్తలను నిందితులుగా చేర్చి.. వైసీపీ నుంచి 12 మందితో సరిపెట్టేశారు. ఐతే.. దాడికి తెగబడిన ఒక్క వైసీపీ నేతనూ అరెస్టు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

POLICE NO ACTION ON GANNAVARAM INCIDENT
POLICE NO ACTION ON GANNAVARAM INCIDENT
author img

By

Published : Feb 25, 2023, 7:46 AM IST

POLICE NO ACTION ON GANNAVARAM INCIDENT : ఈ నెల 20న కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయంపై విధ్వంసానికి సంబంధించి మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. ఇందులో 59 మంది తెలుగుదేశం శ్రేణులపై.. కఠిన సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కానీ.. అధికార వైసీపీ నుంచి 12 మంది పైనే, అదీ నామమాత్రపు కేసులు పెట్టారు. అక్కడ గాయాలైంది టీడీపీ కార్యకర్తలకు, ఆస్తి నష్టమూ ఆ పార్టీకే. ఒకే ఒక్క.. పోలీసుకు గాయమైంది. సీఐపై రాయి విసిరిందెవరో కూడా తెలియదు. కానీ పోలీసులు.. టీడీపీ నేతలపై ఒకేసారి 4 కేసులు నమోదు చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు.. హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు.. తెలుగుదేశం కార్యకర్త కోనేరు సందీప్‌ వాహనాన్ని.. తగలబెట్టారు. టీడీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి కళ్యాణి , బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, వి.హరిబాబు నాయుడు వాహనాలనూ ధ్వంసం చేశారు. కార్యాలయ అద్దాలు పగలగొట్టారు.

టేబుల్‌, కుర్చీలు, ఎన్టీఆర్‌ చిత్రపటం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి స్పష్టమైన వీడియోలున్నా.. దాడి చేసిన వైసీపీ వాళ్లలో ఒక్కరినీ అరెస్టు చేయలేదు. కేవలం 10 మందిపై బెయిల్‌బుల్‌ సెక్షన్లు పెట్టి.. చేతులు దులుపుకున్నారు. మూకుమ్మడిగా టీడీపీ కార్యాలయంపై పడిన వైసీపీ నేతలు... పెట్రోలు పోసి నిప్పంటించి, కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసినా.. వాటిని మారణాయుధాలుగా పరిగణించకపోవడాన్ని తెలుగుదేశం నేతలు నిరసిస్తున్నారు.

క్రైమ్‌ సీన్‌లో ఆధారాలు సేకరించాలంటే.. ఇతరులను ప్రవేశించనీయకూడదు. కానీ ఈ నెల 20న ఘటన జరిగితే.. ఇంత వరకు పోలీసుల నుంచి సాక్ష్యాలు సేకరణ, ఉన్నతాధికారుల పరిశీలన వంటి చర్యలేమీ లేవు. ఇక గన్నవరంలో.. టీడీపీ బీసీ నేత దొంతు చిన్నా నివాసంపై దాడి చేసి ఆయన వాహనం ధ్వంసం చేసినా., అక్కడా క్రైమ్‌ సీన్‌ ఇన్విస్టిగేషన్‌ జరగలేదు. గన్నవరం పార్టీ కార్యాలయాన్ని పరిశీలించిన చంద్రబాబు కూడా.. పోలీసులు ఇంత వరకూ పరిశోధన ప్రారంభించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

విధ్వంసం జరిగిన రోజే 11 మంది తెలుగుదేశం నేతలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కానీ వైసీపీ నుంచి ఒక్కరి పైనా చర్యలులేవు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు రామకృష్ణ, ఆయన వ్యక్తిగత సహాయకుడు పి.రంగా, బసవయ్య, రాంబాబు, శివకుమార్‌ తదితరులు దాడి చేస్తున్న దృశ్యాలు జనబాహుళ్యంలోకి వెళ్లినా.. పోలీసులు మాత్రం వారి జోలికి వెళ్లలేదు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా నివాసం జాతీయ రహదారి పక్కనే ఉంది. దాడికి ముందు.. వైసీపీ నాయకులు ఆయన ఇంటికెళ్లి మరీ బెదిరించారు. సాయంత్రం కారుపై దాడి చేశారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో చిన్నా భార్య ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై పోలీసులు.. ఇద్దరు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మూకుమ్మడి దాడి జరిగితే ఇద్దరినే.. నిందితులుగా చూపడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గన్నవరం ఘటన.. దాడి, కేసులు అన్ని టీడీపీ పైనే.. వైసీపీపై మాత్రం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.