మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయవాడ టూ టౌన్ పోలీసులు 505, 506 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నగర శివారులోని జక్కంపూడి టిడ్కో గృహాలను పరిశీలించడానికి తేదేపా నాయకులతో కలిసి వెళ్లారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వారిని నిలువరించి, గ్రామంలోకి రావద్దని వాగ్వాదానికి దిగారు.
ఉమా తమ గ్రామానికి రావటానికి వీలు లేదంటూ వైకాపా నాయకులు తెలపడంతో.... దేవినేని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో ఒకానొక దశలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గ్రామంలో ఉద్రిక్తలకు కారణమైనందునా దేవినేని ఉమాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి...