సరైన కారణం లేకుండా ఇకపై వాహనాలతో రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తామని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతే తిరిగి వాహనం అప్పజెపుతామని స్పష్టం చేశారు. వేలాది వాహనాలపై జరిమానాలు విధించినా.. రాకపోకలు ఏమాత్రం తగ్గనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ మొదలు.. ఇప్పటి వరకు నగరంలో 20 వేల వాహనాలపై కేసులు నమోదు చేసి, 50 లక్షల రూపాయల జరిమానా విధించామన్నారు. నగరమంతటా 71 ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: